మాస్కు నిబంధనలు గాలికి.. తాజా సర్వేలో వెల్లడి
దిల్లీ: ఒమిక్రాన్ ఓ వైపు ఆందోళన కలిగిస్తున్నా, మన దేశంలో మాస్కుల ధరించే విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన తాజా సర్వేలో కేవలం 2 శాతం మంది ప్రజలు మాత్రమే తమ ప్రాంతం, నగరం లేదా జిల్లాలో మాస్కు నిబంధనను కచ్చితంగా పాటిస్తున్నారని తెలిపారు.
తమ ప్రాంతంలోని చాలా మంది ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వెళ్లేటప్పుడు మాస్కులు ధరించడం లేదని సర్వేలో పాల్గొన్న ముగ్గురిలో ఒకరు చెప్పారు. ఏప్రిల్‌లో నిర్వహించిన ఈ సర్వేలో భారత దేశంలోని 364 జిల్లాల్లో 25 వేల మంది ప్రజలు పాల్గొన్నారు.
ఆ సమయంలో మాస్కు నిబంధనను ప్రజలు కచ్చితంగా పాటిస్తున్నారని 29% చెప్పారు. సెప్టెంబర్‌కల్లా ఆ శాతం 12కు పడిపోయింది. నవంబర్‌లో పరిస్థితి ఇంకా దిగజారి 2 శాతానికి పరిమితమైంది. మాస్కుల ప్రభావం గురించి కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలని,
వస్త్రంతో చేసిన మాస్కులు కొవిడ్-19 నుంచి పరిమిత రక్షణ మాత్రమే కల్పిస్తాయని లోకల్ సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపారియా తెలిపారు
0 Response to "మాస్కు నిబంధనలు గాలికి.. తాజా సర్వేలో వెల్లడి"
Post a Comment