కట్నంపై ఉద్యోగులను అఫిడవిట్ అడిగిన యూపీ
లఖ్‌నవూ, అక్టోబరు 25: వరకట్న నిషేధ చట్టానికి ప్రభుత్వోద్యోగులు కట్టుబడి ఉండేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2004 మార్చి 31 తర్వాత పెళ్ళి చేసుకున్న ప్రభుత్వోద్యోగులు తామెలాంటి వరకట్నం తీసుకోలేదని ప్రకటిస్తూ అఫిడవిట్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇటీవల రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ ఇచ్చిన సర్క్యులర్‌కు ఈనెల 18న గడువు ముగిసింది. అఫిడవిట్ దాఖలు చేయని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది
0 Response to "కట్నంపై ఉద్యోగులను అఫిడవిట్ అడిగిన యూపీ"
Post a Comment