AP news: ఆ ఉపాధ్యాయుడు వస్తే చెట్టుకు కట్టేయండి: ఎమ్మెల్యే ఆగ్రహం





చింతపల్లి: విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం భవుర్తి పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంపై ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ చింతపల్లి మండలంలో పర్యటించిన ఆమె.. పాఠశాలలో ఉపాధ్యాయుడు లేకపోవడాన్ని గమనించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు సస్పెన్షన్ కు గురికాగా... ఆయన స్థానంలో అధికారులు మరొకరిని తాత్కాలికంగా నియమించారు. ఆ తాత్కాలిక ఉపాధ్యాయుడు సైతం రావడం లేదని గ్రామస్తులు వివరించారు. దీనిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఉపాధ్యాయుడు వస్తే చెట్టుకు కట్టేయాలంటూ ఆవేశపడ్డారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "AP news: ఆ ఉపాధ్యాయుడు వస్తే చెట్టుకు కట్టేయండి: ఎమ్మెల్యే ఆగ్రహం"

Post a Comment