నీట్‌ (యూజీ)-2021లో మార్పులు చేర్పుల గడువు 10

దిల్లీ: నీట్‌ (యూజీ) -2021 ఆన్‌లైన్‌ వివరాల భర్తీ అవకాశం అక్టోబరు 1 నుంచి అందుబాటులోకి వచ్చింది. 10వ తేదీ రాత్రి 11.50 దాకా అభ్యర్థులు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. 



ఆన్‌లైన్‌లో పరీక్ష ఫీజు చెల్లించి, ఇప్పటికే రిజిస్టర్‌ చేసుకున్నవారు రెండో సెట్టు సమాచారాన్ని నింపడంతోపాటు మొదటిదశ వివరాల్లో కూడా ఈ-మెయిల్‌ చిరునామా, విద్యార్హత వివరాల వంటివి సరిచూసుకోవచ్చు. రెండోదశ సమాచారం నమోదులో విఫలమైతే అభ్యర్థిత్వాలు పరిగణనలోకి తీసుకోరు. అనుమానాలుంటే 011-40759000 నంబరుకు ఫోన్‌కాల్‌, లేదా -’’్మజీ-్మ్చ.్చ‘.i-. చిరునామాకు మెయిల్‌ చేయవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నీట్‌ (యూజీ)-2021లో మార్పులు చేర్పుల గడువు 10"

Post a Comment