జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై నేడు తీర్పు
అమరావతి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన అప్పీళ్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూ్‌పకుమార్ గోస్వామి, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం గురువారం తమ నిర్ణయాన్ని ప్రకటించనుంది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ఎస్‌ఈసీ, కమిషనర్ నీలం సాహ్ని, ఎన్నికల్లో పోటీచేసిన మరికొందరు అభ్యర్థులు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు ముగియడంతో ఆగస్టు 5న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది
0 Response to "జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై నేడు తీర్పు"
Post a Comment