తండ్రి సైకిల్ పై బట్టలు అమ్మే నిరుపేద.. కొడుకు కలెక్టర్ అయ్యాడు!

 విడుదలైన సివిల్స్ 2020 ఫలితాల్లో బీహార్ కు చెందిన అనిల్ బోసక్ 45వ ర్యాంకును సాధించాడు. కిషన్ గంజ్ జిల్లాలో అత్యంత పేద కుటుంబంలో జన్మించిన అనిల్



అకుంఠిత దీక్షతో ఐఏఎస్ కు ఎంపికయ్యాడు. ఆయన తండ్రి బినోద్ బోసక్ ఇప్పటికి సైకిల్ మీద బట్టలు పెట్టుకుని, అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తుండటం గమనార్హం. తన కుమారుడు సాధించిన విజయంతో ఆయన ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. కొడుకు కలెక్టర్ అయ్యాడనే భావోద్వేగంలో ఆనందభాష్పాలు కారుస్తున్నారు.

అనిల్ బోసక్ ఐఐటీ ఢిల్లీ నుంచి 2018లో పట్టా పుచ్చుకున్నారు. చదవు పూర్తయిన వెంటనే ఉద్యోగం చేయాలనే ఆలోచనను పక్కన పెట్టి, సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాడు. మూడో అటెంప్ట్ లో సివిల్స్ ను క్రాక్ చేశాడు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "తండ్రి సైకిల్ పై బట్టలు అమ్మే నిరుపేద.. కొడుకు కలెక్టర్ అయ్యాడు!"

Post a Comment