AP News: ఓటుతో పాటు చీటీ.. ఏపీ సర్కారుకు మందుబాబు విన్నపం

అనంతపురం: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కంపు నేపథ్యంలో బ్యాలెట్‌ బాక్స్‌లో వచ్చిన ఓ మందు బాబు విన్నపం అక్కడున్న వారిని ఆశ్చర్య పరిచింది. రకరకాల మద్యం బ్రాండ్లతో విసుగెత్తి పోతున్నామని, ఇప్పుడు సరఫరా చేసిన బ్రాండ్లను మార్చాలంటూ ఒక ఓటరు తన ఓటుతో పాటు చీటీ రాసి బ్యాలెట్‌ బాక్సులో వేశారు.
అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం తలమర్లవాండ్లపల్లి ఎంపీటీసీ పరిధిలోని  బ్యాలెట్‌ బాక్సులో ఈ చీటీ బయటపడింది. మద్యం దుకాణాల్లో చల్లని బీర్లతో పాటు మంచి బ్రాండ్‌ ల మద్యాన్ని అందుబాటులో ఉంచాలని చీటీలో మందుబాబు పేర్కొన్నాడు. చీటీలో నల్లచెరువు మందుబాబుల యూత్‌ అధ్యక్షుడు అని రాసి ఉండటం కొసమెరుపు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "AP News: ఓటుతో పాటు చీటీ.. ఏపీ సర్కారుకు మందుబాబు విన్నపం"

Post a Comment