covid-19: బెంగళూరులో 242 మంది చిన్నారులకు పాజిటివ్‌.. ‘థర్డ్‌’ భయంతో అధికారుల అలర్ట్‌!

బెంగళూరు: కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో కొవిడ్‌ మరోసారి కలకలం రేపింది. గత ఐదు రోజుల వ్యవధిలో ఏకంగా 242 మంది 



చిన్నారులకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వీరంతా 19 ఏళ్లలోపు వారే. వీరిలో 9 ఏళ్లలోపు చిన్నారులు 106 మంది ఉండగా.. 9 నుంచి 19 ఏళ్ల వయసువారు 136 మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఈ మేరకు డేటా వెల్లడించింది. 

కొవిడ్ థర్డ్‌ వేవ్‌ వస్తే చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందని భావిస్తున్న తరుణంలో ఇలా తక్కువ వ్యవధిలో పెద్ద సంఖ్యలో చిన్నారులు కొవిడ్‌ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చిన్నారులను ఇళ్లలో ఉంచాలని తల్లిదండ్రులకు అధికారులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " covid-19: బెంగళూరులో 242 మంది చిన్నారులకు పాజిటివ్‌.. ‘థర్డ్‌’ భయంతో అధికారుల అలర్ట్‌!"

Post a Comment