బూస్టర్ డోసులు అవసరమా.. ఎయిమ్స్ డైరెక్టర్ ఏమన్నారంటే.



న్యూఢిల్లీ: కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోసుల అంశం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఆస్పత్రి డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా ఈ విషయంపై తాజాగా స్పందించారు. దేశంలో బూస్టర్ డోసుల అవసరం ఉందా లేదా అని తేల్చేందుకు అవసరమైన శాస్త్రీయాసమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదని ఆయన తెలిపారు. వ్యాక్సిన్లు ద్వారా ఎంత మేరకు రక్షణ లభిస్తోందో తెలిపే సమాచారం అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొంత సమాచారం లభ్యమవుతోందని, రాబోయే నెలల్లో మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయన్నారు.


వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ విషయమై స్పష్టత రావచ్చని డా. గులేరియా అంచనా వేశారు. ఓ జాతీయ చానల్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. మూడో డోసు వల్ల అత్యధిక స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని పలు అధ్యయనాలు ఇప్పటికే తేల్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, వంటి దేశాలు..దేశ ప్రజలకు మూడో డోసు(బూస్టర్ డోసు) ఇచ్చే దిశగా ప్రణాళికలు రచిస్తున్నాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "బూస్టర్ డోసులు అవసరమా.. ఎయిమ్స్ డైరెక్టర్ ఏమన్నారంటే."

Post a Comment