సంస్కరణలు దేశానికే తలమానికం

: మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యాలయాల్లో ఉన్న కోర్సులను మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆయన బుధవారం నూజివీడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో డిగ్రీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్థులతో ‘ఇంటర్న్‌ షిప్’ని చేయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు



గడిచిన రెండేళ్లలో విద్యావిధానంలో చేసిన మార్పులు, సంస్కరణలు దేశానికే తలమానికంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీ వ్యవస్థను కార్పొరేట్ విద్యా సంస్థలు నిర్వీర్యం చేశాయని పేర్కొన్నారు. నూజివీడులో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయెట్ సెంటర్‌ను అటామనస్ ఇనిస్టిట్యూట్‌గా గుర్తించి యూనివర్సిటీతో సంబంధం లేకుండా స్వయం ప్రతిపత్తి హోదాతో అభివృద్ధి చేయాలని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ని మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆదేశించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సంస్కరణలు దేశానికే తలమానికం"

Post a Comment