📚✍14, 16న NEP కి వ్యతిరేకంగా నిరసనలు✍📚* *♦ఫ్యాప్టో పిలుపు
*📚✍14, 16న NEP కి వ్యతిరేకంగా నిరసనలు✍📚*
*♦ఫ్యాప్టో పిలుపు*
*🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో* రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం
(NEP) ఈ నెల 16 నుంచి అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో నిరసన ప్రదర్శనలు, బ్లాక్ బ్యాడ్జీలు ధరించి నిరసన చేయాలని ఫ్యాప్టో పిలుపునిచ్చింది. ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్కు ఫ్యాప్టో చైర్మన్ సిహెచ్ జోసఫ్ సుధీర్ బాబు, సెక్రటరీ జనరల్ సిహెచ్ శరత్ చంద్ర బుధవారం లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎపిపై 44 ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పాటుచేసిన సమావేశంలో 42 సంఘాలు వ్యతిరేకించాయని తెలిపారు. ఎమ్మెల్సీలతో ఏర్పాటుచేసిన సమావేశం లోనూ వారు ఏకగ్రీవంగా వ్యతిరేకించారని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఫ్యాప్టో ఆధ్వర్యాన ఈ నెల 14వ తేదీన జిల్లా కలెక్టరు కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శలు చేపట్టాలని, 16వ తేదీన నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయులు విధులకు హాజరై నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
ఫ్యాప్టో అధికారికంగా విద్యారంగ సమస్యలను చేపట్టడం హర్షించదగ్గ విషయం
ReplyDelete