11 జిల్లాల్లో ఈవినింగ్‌ కళాశాలలు


బెంగళూరు: సంధ్యా శక్తి పథకంలో భాగంగా రాష్ట్రంలోని 11 జిల్లాల్లో సా యంకాల కళాశాలలను ప్రారంభించనున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలోనే ఇవి పనిచేయడం ప్రారంభిస్తాయని విద్యాశాఖ అధికారి ఒకరు గురువారం మీడియాకు తెలిపారు. బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారన్నారు. బెంగళూరు, తుమకూరు, బెళగావి, మైసూరు, శివమొగ్గ, దావణగెరె, ధార్వాడ, కల్బుర్గి, విజయపుర, బళ్ళారి తదితర జిల్లాల్లో సాయంకాల కళాశాలల ప్రారంభానికి ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని సదరు అధికారి వెల్లడించారు. బెంగళూరులోని ఆర్‌సి కాలేజీని ఇందుకు ఎంపిక చేశామన్నారు. ఉపాధి అవకాశాలు తక్షణం కల్పించే రకరకాల కోర్సులను ఈ సాయంకాలం కళాశాలల్లో బోధించనున్నారు. రాత్రిపూట తరగతులకు వచ్చే విద్యార్ధినుల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. సాయంకాల కళాశాలలకు బోధనాసి బ్బంది కొరత లేదని ఆయన తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "11 జిల్లాల్లో ఈవినింగ్‌ కళాశాలలు"

Post a Comment