విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు

వద్దన్నవారికి ఎప్పటిలాగే ఆర్థిక సాయం 

ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు జారీ 



అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): జగనన్న వసతి దీవెన పథకం కింద ఆర్థిక సాయానికి ప్రత్యామ్నాయంగా ల్యాప్‌టా్‌పలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘అమ్మఒడి’ కింద నగదు, లేకుంటే ల్యాప్‌టాప్‌ ఇస్తున్నట్లే ఇప్పుడు ఉన్నత విద్య అంటే డిగ్రీ, పీజీ, ఫార్మసీ తదితర కోర్సులు చదివే విద్యార్థులకు కూడా ఈ అవకాశం కల్పించారు. వసతి దీవెన పథకం కింద లబ్ధి పొందుతున్న వారంతా ఈ పథకానికి అర్హులే. ల్యాప్‌టాప్‌ వద్దన్నవారికి ఎప్పటిలాగే ఆర్థికసాయం అందిస్తారు. వీటిలో ఏది కావాలో ఎంచుకునే ఆప్షన్‌ విద్యార్థులకే ఇచ్చారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికోసం మూడేళ్ల సమగ్ర వారంటీ ఉండే రెండు రకాల లాప్‌ట్యా్‌పలను ఎంపిక చేశారు. 


ఇవీ ఫీచర్లు... 

బేసిక్‌ ల్యాప్‌టాప్‌: ఇంటెల్‌ పెంటియమ్‌ సిల్వర్‌ సిరీస్‌ ఏఎండీ అథ్లాన్‌ 3000(లేకుంటే దానికి సమానమైంది), 4జీబీ ర్యామ్‌, 500జీబీ హార్డ్‌డిస్క్‌, 14అంగుళాల హైడెఫినిషన్‌ స్ర్కీన్‌, ఇతర సౌకర్యాలు ఉంటాయి. 

అడ్వాన్స్‌ ల్యాప్‌టాప్‌: ఇంటెల్‌ కోర్‌ ఐ3, ఏఎండీ రైజెన్‌ 3, 3,250 సిరీస్‌లో 8జీబీ రామ్‌తో పాటు బేసిక్‌ లాప్‌ట్యాప్‌ తరహాలోనే ఇతర ఫీచర్లు ఉంటాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు"

Post a Comment