గ్రామ సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్‌ కావాలంటే ఆ పరీక్ష పాసవ్వాల్సిందే

అమరావతి: గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్ కావాలంటే డిపార్టుమెంట్ పరీక్ష తప్పక పాస్ కావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఐఎఎస్‌లు సహా అన్ని విభాగాల ఉద్యోగులకూ మొదట్నుంచీ ఈ విధానమే అమలవుతోందన్నారు. గ్రామవార్డు  సచివాలయాల్లో నియమితులైన వారిలో ఎవరి ఉద్యోగాలూ పోవని హామీ ఇచ్చారు. 





సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రొబేషన్ నుంచి పర్మినెంట్ అయ్యేందుకు నిబంధనల మేరకే పరీక్ష ఉంటుంది. పరీక్ష పాస్ కాకపోతే ప్రొబేషన్ పొడిగిస్తారు. పరీక్ష పాసైన వెంటనే ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తారు. సచివాలయ ఉద్యోగులకు డిపార్టుమెంటల్ టెస్టు తప్ప మరో పరీక్ష ఉండదు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఏ ఒక్కరి ఉద్యోగం పోదు.. ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఢోకా లేదు’’ అని వివరించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "గ్రామ సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్‌ కావాలంటే ఆ పరీక్ష పాసవ్వాల్సిందే"

Post a Comment