WhatsApp: వాట్సప్ నుంచి అదిరిపోయే ఫీచర్... ఇక డెస్క్‌టాప్ నుంచి వీడియో కాల్, గ్రూప్ కాల్

కరోనా వైరస్ సంక్షోభంలో వీడియో కాల్స్, గ్రూప్ కాల్స్, వీడియో కాన్ఫరెన్స్ లాంటివి పెరిగిపోయాయి. సరిగ్గా అదే సమయంలో జూమ్ యాప్, గూగుల్ మీట్ లాంటివాటికి డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పటికీ వీడియో కాల్స్‌కి డిమాండ్ బాగానే ఉంది. ఇప్పుడు వాట్సప్ కూడా డెస్క్‌టాప్ ద్వారా వీడియో కాల్స్, గ్రూప్ కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం కొత్త ఫీచర్ లాంఛ్ చేసింది. డెస్క్‌టాప్‌లో వీడియో కాల్స్ ఫీచర్‌ని వాట్సప్ తీసుకొస్తుందన్న ప్రచారం చాలాకాలంగా ఉంది. 



మొత్తానికి ఈ ఫీచర్ వచ్చేసింది. కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో వాట్సప్ వెబ్ ఉపయోగించేవారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. వాట్సప్ డెస్క్‌టాప్ ద్వారా చేసే వీడియో కాల్స్, వాయిస్ కాల్స్‌కి కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుందని వాట్సప్ ప్రకటించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "WhatsApp: వాట్సప్ నుంచి అదిరిపోయే ఫీచర్... ఇక డెస్క్‌టాప్ నుంచి వీడియో కాల్, గ్రూప్ కాల్"

Post a Comment