ఉన్నత విద్య ప్రణాళికా మండలి ఏర్పాటు

ఉన్నత విద్య ప్రణాళికా మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ దీనికి చైర్మన్‌గా, సెక్రెటరీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా.. ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక సీఎస్‌, ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌-1, 2, కళాశాల విద్య ప్రత్యేక కమిషనర్‌, 12 సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్స్‌కు చెందిన డైరెక్టర్ల నామినీ ఒకరు, రాష్ట్ర వర్సిటీలకు చెందిన వీసీ ఒకరు ఉంటారు. ఈ మండలి వార్షిక ఖర్చుల కోసం రూ.52.20 లక్షల బడ్జెట్‌ను కేటాయించారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక సీఎస్‌ సతీశ్‌చంద్ర గురువారం ఉత్తర్వులు జారీచేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉన్నత విద్య ప్రణాళికా మండలి ఏర్పాటు"

Post a Comment