పూర్వ విద్యార్థుల సంఘాల ఏర్పాటుకు యూజీసీ ఆదేశాలు

*💁‍♀️పూర్వ విద్యార్థుల సంఘాల ఏర్పాటుకు యూజీసీ ఆదేశాలు..*

🍁ఈనాడు, అమరావతి: 

*🔰ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పూర్వ విద్యార్థుల సంఘాలను ఏర్పాటు చేయాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 15లోగా ‘అల్యుమ్ని కనెక్ట్‌’ పేరుతో వీటిని ఏర్పాటు చేయాలని సూచించింది. విద్యా సంస్థలో చదివి విదేశాల్లో, మన దేశంలో స్థిరపడిన వారితో ఈ సంఘాలను ఏర్పాటు చేయాలని తెలిపింది. విద్యా సంస్థలకు అకడమిక్‌ మద్దతు, నిధుల సమీకరణకు ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొంది. విద్యా సంస్థ కొత్తగా చేపట్టిన విధానాలపై పూర్వ విద్యార్థులకు సమాచారం అందించాలని, వెబ్‌నార్‌, కాన్ఫరెన్స్‌ల్లో పాల్గొనేందుకు వారిని ఆహ్వానించాలని సూచించింది.*

🌾🍃🍃🌾🍃🍃🍃🌾🍃🍃🍃🌾

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పూర్వ విద్యార్థుల సంఘాల ఏర్పాటుకు యూజీసీ ఆదేశాలు"

Post a Comment