ఫిబ్రవరిలో ప్రతిభాన్వేషణ పోటీలు
*ఫిబ్రవరిలో ప్రతిభాన్వేషణ పోటీలు*
*ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు భారతీయ విజ్ఞాన మండలి -ఎపి రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ కౌశల పోటీలు ఫిబ్రవరిలో జరగనున్నాయి.
8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ లో ప్రాథమిక పరీక్ష నిర్వహించి, ప్రతి పాఠశాల నుంచి తరగతికి పది మందిని ఎంపిక చేస్తారు.
వీటిల్లో మొదటి స్థానం పొందిన విద్యార్థులను ఒక టీమ్ గా ఎంపిక చేసి, జిల్లా స్థాయి పోటీలకు ప్రతి జిల్లా నుంచి టీమ్లను అనుమతిస్తారు. ఈ నెల 31వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ప్రాథమిక స్థాయి పరీక్ష ఫిబ్రవరి 9న, జిల్లా స్థాయి పోటీలు ఫిబ్రవరి 16న, రాష్ట్రస్థాయి పోటీలు ఫిబ్రవరి 27న జరుగుతాయి. పాఠశాల కో-ఆర్డినేటర్లు ఈ నెల 31లోపు విద్యార్థుల పేర్లను
www.bvmap.org ద్వారా నమోదు చేయాలి. రాష్ట్రస్థాయి విజేతలకు రాష్ట్ర గవర్నరు చేతులమీదుగా బహుమతులు అందిస్తారు. 7, 8, 9 తరగతుల గణితం, సైన్స్ తో పాటు విజ్ఞాన భారతి వారి 'విజ్ఞానశాస్త్ర రంగంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి' సిలబస్ నుంచి ప్రశ్నలు ఇవ్వనున్నారు.
0 Response to "ఫిబ్రవరిలో ప్రతిభాన్వేషణ పోటీలు"
Post a Comment