పల్స్‌ పోలియో తేదీ ఖరారు

పల్స్‌ పోలియో తేదీ ఖరారు

: జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమం తేదీని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని జనవరి 31న 
నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. 

.

ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేసింది. పల్స్‌పోలియో కార్యక్రమాన్ని జనవరి 17 నిర్వహించాలని తొలుత కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి భారీ ఎత్తున కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో పల్స్‌ పోలియో కార్యక్రమం తేదీని మార్చినట్టు తెలిపింది. రాష్ట్రపతి కార్యాలయాన్ని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంచేసింది. అయితే, జనవరి 30న ఉదయం 11.45 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్‌ కోవింద్‌ కొందరు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ప్రకటనలో పేర్కొంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పల్స్‌ పోలియో తేదీ ఖరారు"

Post a Comment