📚✍సెక్షన్ 80సీ* *సడలింపుపై ఆశలు✍📚* *♦వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు పరిమితి రూ.3 లక్షలకు పెంచేనా?*
*📚✍సెక్షన్ 80సీ*
*సడలింపుపై ఆశలు✍📚*
*♦వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు పరిమితి రూ.3 లక్షలకు పెంచేనా?*
*🌻న్యూఢిల్లీ:* రానున్నబడ్జెట్ 2021-22లో పన్ను మినహాయింపుపై కొన్ని వర్గాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితి పెంపుపై వ్యక్తులు, నిపుణులు ఆశా వాదంతో ఉన్నారు. ప్రస్తుతం సెక్షన్ 80సీ కింద పీపీఎఫ్, ఐదేళ్ల బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్ ప్రొవిడెంట్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల వంటి పెట్టుబడులపై ఆదాయంలో రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తోంది. ఈ పరిమితిని రూ. 3 లక్షల వరకు పెంపుపై ఆశలు పెట్టుకున్నారు. ఇదే అంశంపై ట్యాక్స్ కన్సల్టెన్నీ సంస్థ అంకిత్ సెహ్రా అండ్ అసోసియేట్స్ వ్యవస్థాపకుడు, ట్యాక్స్ నిపుణులు అంకిత్ సెహ్రా స్పందిస్తూ... ఈ బడ్జెట్లో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితిని పెంచవచ్చునని అభిలాష వ్యక్తం చేశారు. ప్రస్తుతం రూ.1.50 లక్షలుగా ఉన్న పన్ను మినహాయింపును రూ.3 లక్షల వరకు పెంచే అవకాశా లున్నాయని అంకిత్ అభిప్రాయపడ్డారు. అంచనాలకు తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తే పెట్టుబడులకు ఊతమిచ్చినట్టవుతుంది. అంతేకా కుండా దేశాభివృద్ధికి ఎంతోగానో తో డ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు బడ్జెట్ 20 21పై రివ్యూలో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల వరకు పెంచవచ్చునని 'యస్ సెక్యూరిటీస్' విశ్లేషించింది. ఆర్థిక వ్యవస్థలో సప్లయి కోసం ప్ర భుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. డిమాండ్ పరంగా చూసే కుటుం బాల ఆదాయాలను దృష్టిలో ఉంచుకోవాలి. తద్వారా ఆర్థిక వ్యవస్థలో సమాతాస్థితి ఏర్పడుతుందని 'యస్ సెక్యూ రిటీస్' పేర్కొంది. అంతేకాకుండా గృహ రుణాలపై మిన హాయింపుల తోసహా రియల్ ఎస్టేట్ డిమాండ్ కు తగ్గట్టు విధానా లను ఈ బడ్జెట్ ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేసింది. జీతాలపై ఆధారపడే వర్గాలకు హెచ్ ఆర్ఏ పరిమి తులకు అనుగుణంగా గృహరుణరీపేమెంట్లవెసులుబా టును కల్పించవచ్చునని విశ్లేషించింది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Response to "📚✍సెక్షన్ 80సీ* *సడలింపుపై ఆశలు✍📚* *♦వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు పరిమితి రూ.3 లక్షలకు పెంచేనా?*"
Post a Comment