టీచర్లను బెదిరిస్తున్నారు

మంత్రులు, ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం..నేడు ఎమ్మెల్సీల దీక్ష


అమరావతి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ బదిలీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ టీచర్లను బెదిరిస్తున్నారని ఎమ్మెల్సీలు ఆరోపించారు. బదిలీల విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ జోక్యం చేసుకోవాలని కోరుతూ గురువారం (24న) నిరాహార దీక్ష చేస్తున్నట్లు ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కేఎస్‌ లక్ష్మణరావు, కత్తి నరసింహారెడ్డి, పాకలపాటి రఘువర్మ, ఇళ్ల వెంకటేశ్వరరావు, రాము సూర్యారావు, యండపల్లి శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. ఉపాధ్యాయుల బదిలీల్లో ఎప్పుడూ లేని పరిస్థితి నెలకొందని వారు తెలిపారు. ఒకవైపు బదిలీలు ఎప్పటికి పూర్తవుతాయో ఎవరికీ అంతుపట్టని స్థితి కాగా, మరోవైపు మొత్తం ఉపాధ్యాయ లోకాన్ని విద్యాశాఖ ఒక శత్రువులా చూస్తుందన్నారు. రోజూ ఏదో ఒక ప్రకటనతో మంత్రి, అధికారులు దాడికి పూనుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బదిలీ ఒక హక్కు కాదని.. తాము అనుకుంటే ఎవరిని ఎక్కడికైనా బదిలీ చేయవచ్చని కౌన్సెలింగ్‌కి వ్యతిరేకంగా ఫోన్‌చేసి మరీ టీచర్లను హెచ్చరిస్తున్నారని ఎమ్మెల్సీలు తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "టీచర్లను బెదిరిస్తున్నారు"

Post a Comment