పాఠశాల విద్యార్థుల కోసం గో-ఫర్ గోల్డ్ కార్యక్రమాన్ని ప్రకటించిన యూఎన్ అకాడమీ
బెంగళూరు: భారతదేశంలో సుప్రసిద్ధ అభ్యాస వేదిక యూఎన్ అకాడమీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఇన్ ఇన్‌ఫార్మిటిక్స్ (ఐఓఐ) 2021లో పాల్గొంటున్న భారతీయ పాఠశాల విద్యార్థుల కోసం గో–ఫర్ గోల్డ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాఠశాల విద్యార్థుల కోసం ప్రోగ్రామింగ్, ఇన్‌ఫార్మిటిక్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన యునెస్కో గుర్తించిన ఒలింపియాడ్ ఐఓఐ, గో–ఫర్ గోల్డ్ కార్యక్రమాన్ని 2013వ సంవత్సరంలో కోడ్ చెఫ్ ప్రారంభించారు. తద్వారా ఐఓఐ పోటీలో ప్రతిభ మరియు శిక్షణ కోరుకునే పోటీదారుల నడుమ ఖాళీని పూరించనుంది.
జూన్ 2020లో కోడ్ చెఫ్ కస్టోడియన్‌షిప్‌గా యూఎన్ అకాడమీ బాధ్యతలు తీసుకుంది. ఈ గో ఫర్ గోల్డ్ కార్యక్రమంలో భాగంగా, యూఎన్ అకాడమీ రూ. 15 లక్షల నగదు బహుమతిని అందించనుంది. దీనితో పాటుగా ల్యాప్‌టాప్ మరియు ఇతర బహుమతులను ఐఓఐ 2021 వద్ద బంగారు పతకం అందుకున్న భారతీయ విద్యార్థులకు అందించనుంది. కోడ్ చెఫ్ యొక్క గో–ఫర్ గోల్డ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని యూఎన్ అకాడమీ తీసుకున్న నిర్ణయం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నామని కోడ్ చెఫ్ బిజినెస్ హెడ్–యుఎన్ అకాడమీ ప్రతినిధి అనూప్ కల్బాలియా అన్నారు.
కోడ్ చెఫ్ ఇప్పుడు ఉచిత అభ్యాస కార్యక్రమాన్ని ఐఓఐ ప్రిపరేషన్ కోసం యుఎన్ అకాడమీ ప్లాట్‌ఫామ్‌పై ఆరంభించింది. ఐఓఐ, ఐసీఓ, కోడ్ చెఫ్ ప్రతి సంవత్సరం 85 కు పైగా దేశాల నుంచి నలుగురు విద్యార్థులు చొప్పున ఐఓఐలో పాల్గొంటారు. ఐఓఐలో పాల్గొనే నలుగురు విద్యార్థులను జాతీయ స్థాయి ఒలింపియాడ్ ద్వారా ఎంపిక చేస్తారు. దీనినే ఇండియప్ కంప్యూటింగ్ ఒలింపియాడ్ (ఐసీఓ) అంటారు. ఐసీఓను కోడ్ చెఫ్ మరియు టీసీఎస్ అయాన్ మద్దతుతో ఇండియన్ అసోసియేషన్ ఫర్ రీసెర్చ్ ఇన్ కంప్యూటింగ్ సైన్స్ (ఐఏఆర్‌సీఎస్) నిర్వహిస్తుంది
0 Response to "పాఠశాల విద్యార్థుల కోసం గో-ఫర్ గోల్డ్ కార్యక్రమాన్ని ప్రకటించిన యూఎన్ అకాడమీ"
Post a Comment