విద్యార్థులను బలవంతంగా రప్పించట్లేదు:అవంతి
విశాఖ: కరోనా సమయంలో విద్యార్థులను బలవంతంగా ప్రభుత్వ పాఠశాలలకు రప్పించడం లేదని.. తల్లిదండ్రుల ఇష్టప్రకారమే హాజరుకావొచ్చని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడారు.
పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ సమయంలో విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ తరగతులు వినేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలు, ఇంటర్నెట్ సౌకర్యం లేని పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు ప్రారంభించామని మంత్రి చెప్పారు.
పాఠశాలలు తెరిచిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు పరీక్షలు నిర్వహించగా కొంతమందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. 829మంది ఉపాధ్యాయులు, 575 మంది విద్యార్థులు కరోనా బారిన పడినట్టు ఇటీవల పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది
0 Response to "విద్యార్థులను బలవంతంగా రప్పించట్లేదు:అవంతి"
Post a Comment