తీవ్రం'గా అల్పపీడనం
నేడు వాయుగుండంగా మార్పు!
దక్షిణ కోస్తా, సీమల్లో 4 రోజులు వర్షాలు
విశాఖపట్నం, అమరావతి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న అల్పపీడనం బలపడి ఆదివారం తీవ్ర అల్ప పీడనంగా మారింది.
ఇది మరింత బలపడి సోమవారం సాయంత్రానికికల్లా వాయుగుండంగా మారనుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ, బుధవారానికి దక్షిణ తమిళనాడు తీరాన్ని చేరే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల సోమ, మంగళవారాల్లో దక్షిణకోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో దక్షిణకోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది
కాగా.. వచ్చే 3 నెలల్లో రాష్ట్రంలో చలి సాధారణ స్థాయిలోనే ఉంటుంది. ఎప్పుడైనా ఉత్తరాది నుంచి వచ్చే గాలుల తీవ్రతతో తప్ప మిగిలిన సమయాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని ఐఎండీ తెలిపింది
0 Response to "తీవ్రం'గా అల్పపీడనం"
Post a Comment