డాక్యుమెంట్లు, ఈసీలు ఇక ఉచితం

సెర్చ్‌ రిపోర్టులు కూడా.. ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్ల సర్టిఫైడ్‌ కాపీలు, ఎన్‌కంబరన్స్‌ సర్టిఫికెట్లు (ఈసీ), సెర్చ్‌ రిపోర్టులు ఇకనుంచి ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 




ఇప్పటివరకు ఒక డాక్యుమెంట్‌ సర్టిఫైడ్‌ కాపీ కావాలంటే సుమారు రూ.300, ఈసీ కావాలంటే రూ.220 చెల్లించాల్సి వచ్చేది. సెర్చ్‌ రిపోర్టుకు కూడా కొంత రుసుం కట్టాలి. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇక మీదట ఇవన్నీ ఉచితంగానే పొందవచ్చు. ఈ మేరకు రిజిస్ర్టేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈసీలు, సెర్చ్‌ రిపోర్టులు గతంలోనూ ఆన్‌లైన్‌లో ఉచితమే అయినా


సబ్‌ రిజిస్ర్టార్‌కు దరఖాస్తు చేసుకుంటే మాత్రం రుసుం కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అది కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, అన్నీ ఉచితమేనని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "డాక్యుమెంట్లు, ఈసీలు ఇక ఉచితం"

Post a Comment