ఒక్కో చిన్నారికి రూ.6 లక్షలు

  • ఎన్‌జీఓలు నడుపుతున్న 638 సీసీఐలకు 
  • భారీగా విదేశీ నిధులు.. తెలంగాణ, ఏపీ ఎన్‌జీఓలకూ లబ్ధి 


న్యూఢిల్లీ, నవంబరు 18: ఎన్‌జీఓలు నడుపుతున్న 600కు పైగా బాలల సంరక్షణ సంస్థల్లో (సీసీఐ)కి 2018-19 సంవత్సరంలో భారీ స్థాయిలో విదేశీ నిధులు వచ్చినట్టు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) తెలిపింది. ఈ ఏడాదిలో ఒక్కో చిన్నారికి గరిష్ఠంగా రూ.6 లక్షల వరకు విదేశీ నిధులు అందుకున్నట్టు పేర్కొంది. అయితే అంచనా వేసిన సగటు వ్యయం కన్నా ఇది చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక అవకతవకలకు అవకాశం ఉందన్న ఆందోళనలను ఎన్‌సీపీసీఆర్‌ వ్యక్తం చేస్తోంది. ఐదు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు) ఎన్‌జీఓలు నడుపుతున్న దాదాపు 638 సీసీఐల సమాచారాన్ని రాండమ్‌గా విశ్లేషించారు. వీటిలో 28,000 మంది పిల్లలున్నారు. 2018-19 సంవత్సరంలో ఇవి సగటున ఒక్కో చిన్నారికి వసూలు చేసిన మొత్తం రూ.2.12 లక్షల నుంచి రూ.6.60 లక్షల వరకు ఉన్నట్టు ఎన్‌సీపీసీఆర్‌ గుర్తించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఒక్కో చిన్నారికి రూ.6 లక్షలు"

Post a Comment