పాఠశాలల ప్రారంభానికి ముందు పాటించవలసిన ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత మరియు సురక్షితంగా
ఉండుటకు ప్రామాణిక కార్యాచరణ విధానాలు
పాఠశాలలో సరైన శుభ్రత మరియు పారిశుద్ధ్య సౌకర్యాలు ఉందేలా చూడటం
ఫర్నిచర్, పరికరాలు, స్టేషనరీ, నిల్వ స్థలాలు, వాటర్ ట్యాంకులు, వంటశాలలు, క్యాంటీన్, వాష్ రూంలు,
ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, మొదలైన అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా శుభ్రపరచడానికి మరియు
క్రిమిసంహారం చేయడానికి ఏర్పాట్లు చేసుకొనడం.
పాఠశాలలో చేతులు కడుక్కోవడానికి సౌకర్యాలు ఉండేలా చూడటం.
ధర్మామీటరు, క్రిమి సంహారకాలు, సబ్బులు మొదలైన కీలక సామగ్రి లభ్యతను నిర్ధారించుకోవడం.
పాఠశాల పిల్లల రవాణా ప్రారంభించే ముందు పరిశుభ్రతను నిర్ధారించుకోవడం.
సరు గాగాగయిం[[ళ్యం?యు వద్ద అందుబాటులో ఉన్న సాధారణ బహిరంగ ప్రదేశాలలో క్రిమి సంహారకం
చేయడంపై ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గదర్శకాలు అనుసరించాలి.
వేర్వేరు టాస్క్ టీంను ఏర్పాటు చేయడం
కేటాయించిన బాధ్యతలతో అత్యవసర సంరక్షణ మద్ధతు / ప్రతిస్పందన బృందం అందరు భాగస్వాములకు
జనరల్ సపోర్ట్ టీం, కమోడిటీ టీం, పరిశుభ్రత తనిఖీ బృందం వంటి టాస్క్ జట్లు సహాయపడతాయి.
ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ఇతర భాగస్వాములు ఈ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యులుగా గుర్తించబడతారు.
వారు వ్యూహాత్మక మరియు తక్షణ చర్యలు తీసుకోవడానికి పరస్పర సహకారంతో పని చేస్తారు.
సీటింగ్ ప్రణాళిక
ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించినట్లుగా, సవరించిన సీటింగ్ ప్రణాళికలో విద్యార్థుల మధ్య కనీసం 6
అడుగుల దూరం ఉండాలి. విద్యార్థులు ఆక్రమించాల్సిన సీటింగ్ గుర్తించడం మంచిది.
సింగిల్-సీటెడ్ డెస్క్‌లు ఉంటే, 6 అడుగుల భౌతిక / సామాజిక దూరాన్ని నిర్వహించడానికి తరగతి
గదుల్లోని డెస్క్‌ల మధ్య ఖాళీ ఉంచడం ప్రభావవంతంగా ఉంటుంది.
అదే విధంగా భౌతిక / సామాజిక దూరం సిబ్బంది గదులు, కార్యాలయ ప్రాంతం మరియు ఇతర ప్రజా
క్షేత్రాలలో కూడా పాటించాలి.
అందుబాటులో ఉండే పిల్లల భద్రత మరియు భౌతిక దూర ప్రోటోకాల్‌లను దృష్టిలో ఉంచుకొని, తాత్మాలిక
స్థలం లేదా బహిరంగ ప్రదేశాలు (ఆహ్లాదకరమైన వాతావరణంలో) తరగతులు నిర్వహించడానికి
ఉపయోగించవచ్చు.
సిబ్బంది గది మరియు అందుబాటులో ఉన్న ఇతర గదులు / హాల్స్‌లో ఉపాధ్యాయులకు తగిన దూరంలో
సీట్లు ఏర్పాటు చేయవచ్చు.
రిసెప్షన్ ఏరియాలో సీట్ల సంఖ్య వాటి మధ్య కనీసం 6 అడుగుల దూరంతో ఏర్పాటు చేయవచ్చు.
0 Response to "కోవిద్-19 పాఠశాలల ప్రారంభానికి ముందు, తరువాత పాటించవలసిన అరోగ్య రక్షణ విధానాలు మరియుభౌతిక / సామాజిక దూరాన్ని పాటిస్తూ విద్య నేర్చుకోవడంపై మార్గదర్శకాలు"
Post a Comment