ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేస్తే సున్నా చేర్చాలి జనవరి 1 నుంచి అమలు స్పష్టంచేసిన టెలికాం శాఖ
దిల్లీ: ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు ఫోన్ చేసినప్పుడు నెంబరు ముందు సున్నా(0) చేర్చాలనే ట్రాయ్ ప్రతిపాదనకు టెలికాం శాఖ ఆమోదం తెలిపింది.
2021 జనవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు ల్యాండ్‌లైన్ నంబరు డయిలింగ్ ప్యాట్రన్‌లో మార్పులు చేయాలని టెలికాం సంస్థలకు నిర్దేశించింది.
ఈ నిబంధన అమల్లోకి వచ్చిన నాటి నుంచి ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు కాల్ చేసినప్పుడు సున్నాను చేర్చడాన్ని అనుసరించాలని టెలికాం శాఖ స్పష్టం చేసింది.
ఈ నిబంధన గురించి ల్యాండ్‌లైన్ చందాదారులకు తెలియజేయాలని పేర్కొంది
0 Response to "ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేస్తే సున్నా చేర్చాలి జనవరి 1 నుంచి అమలు స్పష్టంచేసిన టెలికాం శాఖ"
Post a Comment