School safety guidelines
పాఠశాల రేపటి పౌరులను తీర్చిదిద్దే బాధ్యతాయుత ప్రదేశం. బడి వయస్సు కలిగిన బాలలందరూ
బడిలో నమోదై గుణాత్మక విద్యను పొందడం బాలలహక్కు పాఠశాల బాధ్యత కేవలం విద్యనందించడంతో
మాత్రమే సరిపోదు. బాలలు ఆనందకరమైన వాతావరణంలో స్వేచ్చగా భద్రతతో ఎదగడానికి కూడా బడి
బాధ్యత వహించాలి. రక్షణ-భద్రత ఒక బాలల హక్కు భద్రతాపరమైన చర్యలు చేపట్టడం ద్వారా బడి బాలల
రక్షణకు కృషిచేయాలి. “బడి నుండి ఇంటికి - ఇంటి నుండి బడికి” (11006 [0 500001 - 501001 10 11000)
నినాదం బడిలోనూ, ఇంటిలోనూ, మార్గమధ్యంలోనూ బాలలు అనేక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉ
ందనీ ఆయా సందర్భాలలో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం, సూచనలు చేయడం, అవగాహన
కలిగించడం తక్షణ అవసరమనీ తెలియజేస్తోంది. ఉపాధ్యాయులు, పాఠశాల, తల్లిదండ్రులు బాలల భద్రతను
తమ ఉమ్మడి బాధ్యతగా భావించాలి. ప్రతి పాఠశాల అనుకోకుండా జరిగే అపాయాల నుండి బాలలను
రక్షించడానికి పాఠశాల సురక్ష ప్రణాళిక (50%001 52160 9120) తయారుచేసి అందరికీ అనువుగా ఉండేలా
ప్రదర్శించాలి. పాఠశాల ప్రాంగణంలో జరిగే ప్రమాదాలతోపాటు ఇళ్ళ వద్ద కూడా కుక్క కరవడం, నీటికుంటలలో
పడిపోవడం మొదలైన ప్రమాదాలు పొంచి వుంటాయి. అదేవిధంగా ఆటలలో సరయిన జాగ్రత్తలు
పాటించకపోవడం వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తాయి. ఈ అంశాలపట్ల బాలలకు అవగాహన
కలిగించడంతోపాటు పాఠశాలలు సరైన భద్రతా చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి.
సాధారణంగా ప్రతి పాఠశాల అనుసరించవలసిన పాఠశాల సురక్ష ప్రణాళిక గురించి, ఉపాధ్యాయుడు,
విద్యార్థి అనుసరించవలసిన విధివిధానాలను గురించి పరిశీలిద్దాం
0 Response to "School safety guidelines"
Post a Comment