ఆడ పిల్లల పేర్లు రెడ్ ఇంక్‌తో రాయొద్దన్నాం

సాక్షి, విజయవాడ: పిల్లల్లో సమైక్యతా భావాన్ని పెంచేందుకే స్కూల్‌ రిజిస్టర్‌లో మార్పులు తెచ్చామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చదువులమ్మ ఒడిలో పిల్లలందరూ సమానమే. చిన్న వయస్సులో పిల్లల్లో కులాలు, మతాల చర్చకు తావివ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ ప్రకారంగానే స్కూల్ రిజిస్టర్‌లో కులం, మతం రాయొద్దని అదేశాలిచ్చాం. ఆడ పిల్లల పేర్లు రెడ్ ఇంక్‌తో రాయొద్దని ఆదేశించాం. పిల్లల టీసీలు మాత్రం గతంలో ఇచ్చినట్టే ఇస్తాం



సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. విద్యార్థులకు ప్రతి పథకాన్ని కులాలు, మతాలకు అతీతంగా ఇస్తున్నాం. సీఎం జగన్ పాలనలో అన్ని కులాలు, మతాలు సమానమే. సీఎం జగన్ గొప్ప మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పిల్లల్లో కుల, మత, లింగ వివక్షకు తావు లేకుండా చూడాలనే సీఎం వైఎస్‌ జగన్‌ ఈ ఆలోచన చేశారు' అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆడ పిల్లల పేర్లు రెడ్ ఇంక్‌తో రాయొద్దన్నాం"

Post a Comment