వ్యాక్సిన్ వచ్చేదాకా అజాగ్రత్త వద్దు
ముంబై, అక్టోబరు 13: దేశంలో కరోనా వైరస్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పటికీ వైరస్ విజృంభణ కొనసాగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. ‘ఔషధం వచ్చేదాకా అజాగ్రత్త వద్దు’ అని మోదీ హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా కరోనా కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ మహారాష్ట్రలో పరిస్థితులు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయన్నారు.
వ్యాక్సిన్ వచ్చేవరకు జాగ్రత్తగా ఉండాల్సిందేనని చెప్పారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మాజీ మంత్రి బాలాసాహెబ్ విఖే పాటిల్ ఆత్మకథను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. పేదలు, రైతులు, గ్రామీణుల జీవితాలను బాగు చేసేందుకు బాలాసాహెబ్ తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. సమాజానికి ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ నేతలు దేవేంద్ర ఫడణవీస్ తదితరులు పాల్గొన్నారు

0 Response to "వ్యాక్సిన్ వచ్చేదాకా అజాగ్రత్త వద్దు"
Post a Comment