ఏపీలో ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ కష్టం

అమరావతి: కరోనా కారణంగా రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. 



స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ న్యాయవాది తాండవ యోగేష్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. 

కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయాన్ని ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయం తెలపాలని ఎస్‌ఈసీకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను నవంబరు 2కి వాయిదా వేసింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ కష్టం"

Post a Comment