ఆర్‌జీయూకేటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ నేడే

అమరావతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జి టెక్నాలజీస్‌ (ఆర్‌జీయూకేటీ) ఎంట్రన్స్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ గురువారం 



ఉదయం 10 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నారు.  రాష్ట్రంలోని నూజివీడు, ఆర్‌.కె.వ్యాలీ (ఇడుపులపాయ), శ్రీకాకుళం, ఒంగోలులోని ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల కోసం ఈ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహించనున్నారు. మాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల్లో 3 గంటల పాటు ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నిర్వహించాలని వర్సిటీ సంకల్పించింది.




 ఆబ్జెక్టివ్‌ టైపులో ప్రశ్నలు ఇస్తారు. నవంబర్‌లో ఎంట్రెన్స్‌ టెస్ట్‌ జరిగే అవకాశం ఉంది. ఆఫ్‌లైన్‌లో టెస్ట్‌ జరుగుతుంది.   

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆర్‌జీయూకేటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ నేడే"

Post a Comment