పురుష ఉద్యోగులకూ చైల్డ్ కేర్ లీవ్...
పురుష ప్రభుత్వ ఉద్యోగులూ చిన్నారుల సంరక్షణ సెలవు(చైల్డ్‌కేర్ లీవ్)
తీసుకోవచ్చని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ మంత్రి జితేందర్
సింగ్ తెలిపారు.
అయితే కేవలం తండ్రి ఉన్నవారికే (సింగిల్ మేల్ పేరెంట్)
ఈ వెసులుబాటు వర్తిస్తుందన్నారు. భార్య చనిపోయిన, విడాకులు ఇచ్చిన
తండ్రులు తమ బిడ్డల బాధ్యతలను చూసుకోవడానికి ఈ సెలవును ఉపయోగించుకోవచ్చని
చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినా తగినంత
ప్రచారం రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. చిన్నారుల పాలన కోసం సెలవు తీసుకున్న
ఉద్యోగులు సంబంధిత అధికారి ముందస్తు అనుమతితో తాను పనిచేస్తున్న
కేంద్రాన్ని విడిచిపెట్టి పోవచ్చన్నారు. ఈ సెలవులో ఉన్నప్పటికీ ఎల్‌టీసీ
(లీవ్ ట్రావెల్ కన్సెషన్) ఉపయోగించుకోవచ్చని చెప్పారు.
చిన్నారుల పాలనా
సెలవులు తీసుకున్న వారికి తొలి 365 రోజుల్లో 100% జీతం వస్తుందని, తదుపరి
365 రోజుల్లో 80% జీతం వస్తుందని పేర్కొన్నారు. పిల్లల 22 ఏళ్ల వయసు వరకే
చిన్నారుల పాలనా సెలవును తీసుకోవాలన్న నిబంధనను దివ్యాంగ పిల్లల
తల్లిదండ్రులకు రద్దు చేస్తున్నట్లు చెప్పారు
0 Response to "పురుష ఉద్యోగులకూ చైల్డ్ కేర్ లీవ్..."
Post a Comment