చిన్న మొత్తాలపైనే వడ్డీ ఎక్కువ: పోస్టల్ శాఖ పథకాలు ఆకర్షణీయం
న్యూఢిల్లీ : బ్యాంక్‌ల్లోని ఫిక్సుడ్ డిపాజిట్ల కంటే పోస్టల్ శాఖలోని చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపైనే ఎక్కువగా వడ్డీ రేట్లు వస్తున్నాయి. 2020 డిసెంబర్‌తో ముగియనున్న త్రైమాసికంలో చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ పద్దతిలో మరిన్ని నిధులు సమీకరించాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. కాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లో ప్రస్తుత ఏడాది కాలపరిమితి కలిగిన ఫిక్సుడ్ డిపాజిట్లపై 4.9 శాతం వడ్డీ చెల్లిస్తుంది. ఇదే కాలానికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్‌లు వరుసగా 5.1 శాతం, 5 శాతం చొప్పున వడ్డీ అందిస్తున్నాయి. కాగా పోస్టు ఆఫీసుల్లో మాత్రం చిన్న మొత్తాలపై ఏకంగా 5.5 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది.
ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్‌డిలపై కూడా ఈ అంతరం ఉంది.
ఈ కాలానికి ఎస్‌బిఐ 5.4 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 5.5 శాతం, ఐసిఐసిఐ బ్యాంక్ 5.5 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తున్నాయి. కాని తపాళ శాఖలో నేషనల్ సేవింగ్ సర్టిపికెట్ ప్లాన్‌పై ఏకంగా 6.8 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు. దీంతో బ్యాంక్‌లతో పోల్చితే పోస్టు ఆఫీసుల్లో ఎఫ్‌డిల కాలపరిమితి ముగిసిన తర్వాత అత్యధిక వడ్డీ రేటు లభించడంతో ఇందులోని పథకాలు పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉన్నాయి. తపాళశాఖల్లోని ఎఫ్‌డిలకు ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుంది. అయితే బ్యాంకింగ్ తరహాలో పోస్టు ఆఫీసుల్లో నెట్ బ్యాంకింగ్, బిల్ పేమెంట్ సర్వీసు సదుపాయాలు ఉండవు
0 Response to "చిన్న మొత్తాలపైనే వడ్డీ ఎక్కువ: పోస్టల్ శాఖ పథకాలు ఆకర్షణీయం"
Post a Comment