ట్రిపుల్‌ ఐటీల అడ్మిషన్లకు ప్రవేశపరీక్ష: కేసీ రెడ్డి

నూజివీడు టౌన్‌, అక్టోబరు 10: ఆర్‌జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా టెస్ట్‌ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చాన్సెలర్‌ కేసీ రెడ్డి తెలిపారు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంప్‌సలో శనివారం ఆయన మాట్లాడుతూ ప్రవేశపరీక్ష నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీనిపై విధివిధానాల రూపకల్పనకు టెస్ట్‌ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అలాగే ట్రిపుల్‌ఐటీ శ్రీకాకుళం, ఒంగోలు క్యాంప్‌సలలో పర్మినెంట్‌  పోస్టుల భర్తీకి ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. వీటితోపాటు నూజివీడు ఆర్‌కే వ్యాలీల్లో ఖాళీ పోస్టులకు నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ట్రిపుల్‌ ఐటీ లెక్చరర్‌ పోస్టుల నియామకానికి మెంటర్లకు ప్రత్యేక వెయిటేజీ ఇచ్చేందుకు పరిశీలన చేస్తున్నట్టు చెప్పారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ట్రిపుల్‌ ఐటీల అడ్మిషన్లకు ప్రవేశపరీక్ష: కేసీ రెడ్డి"

Post a Comment