మారటోరియం సమయంలో చెల్లించాల్సిన వడ్డీ విషయంలో రుణగ్రహీతలకు ఊరట

మారటోరియం -𝐌𝐨𝐫𝐚𝐭𝐨𝐫𝐢𝐮𝐦⚘*
          •─────✧─────•

᠅ మారటోరియం సమయంలో చెల్లించాల్సిన వడ్డీ విషయంలో  రుణగ్రహీతలకు ఊరట.

᠅  వడ్డీపై వడ్డీ వదులుకునేందుకు సిద్ధమని కేంద్ర స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. 

᠅ రుణగ్రహీతలకు మారటోరియం ఫలాలు అందాలంటే వడ్డీ భారం భరించడం తప్ప ఇంకో పరిష్కార మార్గం లేదని  కేంద్రం భావన.

᠅ మారటోరియం వ్యవధి అయిన మార్చి నుంచి ఆగస్టు వరకు ఈ మాఫీ వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.

᠅ కరోనాతో ఆదాయాలు తగ్గిన వారికి ఉపశమనం కల్గించేందుకు ఆర్బీఐ మారటోరియం వసతి కల్పించిన విషయం తెలిసిందే. 

᠅ ఆ వ్యవధిలో రుణాలపై వడ్డీ వసూలు చేయడం, ఆ వడ్డీపై వడ్డీ విధించడం వల్ల లాభమేమీ ఉండదని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

᠅ దీనిపై కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తెలపాలని గతంలో పలుసార్లు సుప్రీంకోర్టు ఆదేశించింది. 

᠅ ఆర్బీఐతో చర్చించి రుణగ్రహీతలకు మారటోరియం ప్రయోజనాలు అందేలా చూడాలని స్పష్టం చేసింది. 

᠅ ఆ దిశగా తీసుకునే చర్యలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలంది. ఈ మేరకు కేంద్రం తాజాగా తమ అభిప్రాయాల్ని కోర్టు ముందుంచింది. దీనిపై సోమవారం విచారణ జరగనుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మారటోరియం సమయంలో చెల్లించాల్సిన వడ్డీ విషయంలో రుణగ్రహీతలకు ఊరట"

Post a Comment