విజయనగరం : హైస్కూల్‌లో 9 మంది విద్యార్థులకు కరోనా
విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గినట్లే
తగ్గి మళ్లీ పెరుగుతోందనిపిస్తోంది. తాజాగా.. విజయనగరం జిల్లాలోని
దత్తిరాజేరు మండలం దత్తి జెడ్పీ హైస్కూల్‌లో 09 మంది విద్యార్థులకు కరోనా
పాజిటివ్
అని నిర్ధారణ అయ్యింది. ఓ ఉపాధ్యాయుడికి కూడా పాజిటివ్ వచ్చినట్లు
తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు,
వైద్యాధికారులు వెంటనే ఇద్దర్ని
హోమ్ ఐసోలేషన్‌కు మిగిలిన వారిని జేఎన్టీయూ కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలించి
వైద్యం అందిస్తున్నారు. ఈ విషయంపై ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని
స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ను మంత్రి
ఆదేశించారు
0 Response to "విజయనగరం : హైస్కూల్‌లో 9 మంది విద్యార్థులకు కరోనా"
Post a Comment