స్కూళ్లు, కోచింగ్‌ సెంటర్లను 15 నుంచి తెరవవచ్చు

స్కూళ్లు, కోచింగ్‌ సెంటర్లను 15 నుంచి తెరవవచ్చు.

కానీ రాష్ట్రప్రభుత్వాలు పరిస్థితిని అంచనా వేసి- స్కూళ్ల యాజమాన్యాలతో సంప్రదించి- నిర్ణయం తీసుకోవాలి. ఇందులోనూ కొన్ని నిబంధనలు పాటించాలి. కేంద్రం మార్గదర్శకాలు..ఆన్‌లైన్‌ లేదా దూర విద్యా బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యార్థులు ఆన్‌లైన్‌కే ప్రాధాన్యం ఇస్తే వారిని అనుమతించాలి.

తలిదండ్రుల లిఖితపూర్వక అనుమతితోనే స్కూళ్లకు విద్యార్థులు వెళ్లాలి. ఆ పత్రాన్ని యాజమాన్యాలు తప్పనిసరిగా అడగాలి. హాజరుపై పెద్దగా పట్టింపు ఉండరాదు. తలిదండ్రుల సమ్మతే ముఖ్యం.

స్థానిక అవసరాలకు తగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు విడిగా నిబంధనలు జారీచేయాలి. తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి.కాలేజీలు, ఉన్నతవిద్యాసంస్థలను తెరిచే అంశంపై విద్యాశాఖ, కేంద్ర హోంశాఖ చర్చించి తగిన తేదీ నిర్ణయిస్తాయి. అయితే పీహెచ్‌డీ విద్యార్థులకు, లాబరేటరీలున్న శాస్త్ర సాంకేతిక సంబంధ విద్యాకోర్సులకు సంబంధించిన పీజీ విద్యార్థులకు 15 నుంచి కాలేజీలు తెరవవచ్చు.వర్సిటీలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కూడా కేవలం పీహెచ్‌డీ, టెక్నికల్‌ కోర్సుల వారిని మాత్రమే అనుమతించాలి. కేంద్ర ప్రాయోజిత ఉన్నత విద్యాసంస్థలో ఆ సంస్థ అధిపతిదే తుది నిర్ణయం.

ఇక్కడ కూడా రిసెర్చ్‌ స్కాలర్లు, ఎంఎస్సీ, బీటెక్‌, ఎంటెక్‌ విద్యార్థులకు మాత్రమే అనుమతి. సామాజిక, విద్యా, సాంస్కృతిక, మత, క్రీడా, వినోద, రాజకీయ కార్యక్రమాలకు ఇంతవరకూ 100 మందిని మాత్రమే అనుమతించాలన్న నిబంధన ఉంది. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పెంచుకోవచ్చు. అయితే కొవిడ్‌ నిబంధనలు పాటించాలి.బహిరంగ ప్రదేశాల్లో సభలు, సమావేశాల్లో సామాజిక దూరం తప్పనిసరి. మాస్కులు, శానిటైజర్లు, థర్మల్‌ స్ర్కీనింగ్‌ నిబంధనలు పాటించాలి. కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రం అక్టోబరు 31 దాకా ఖచ్చితమైన ఆంక్షలు కొనసాగుతాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "స్కూళ్లు, కోచింగ్‌ సెంటర్లను 15 నుంచి తెరవవచ్చు"

Post a Comment