సీబీఎస్‌ఈ 12వ తరగతి కంపార్ట్‌మెంట్ ఫలితాలు
దిల్లీ:
ఇటీవల జరిగిన సీబీఎస్‌ఈ 12వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షా ఫలితాలు
విడుదలయ్యాయి. ఈ ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
(సీబీఎస్‌ఈ) శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. ఫలితాల్లో 59.43శాతం
ఉత్తీర్ణతనమోదైంది. సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు జరిగిన పరీక్షలకు
1,16,125 మంది రిజిస్టర్ చేసుకోగా.. 1,05,847మంది హాజరయ్యారు. వీరిలో
52,211మంది ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు వెల్లడించారు.
CLICK HERE TO RESULTS
పరీక్షలు జరిగిన ఎనిమిది రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం విశేషం. మామూలుగా అయితే,
జులై- ఆగస్టు మాసాల మధ్య కంపార్ట్‌మెంట్ పరీక్షలు జరుగుతాయి. కానీ, ఈసారి
కరోనా కల్లోలం నేపథ్యంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల్లో కొవిడ్ నిబంధనలు
పాటిస్తూ సెప్టెంబర్ నెలాఖర్లో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించారు
0 Response to "సీబీఎస్‌ఈ 12వ తరగతి కంపార్ట్‌మెంట్ ఫలితాలు"
Post a Comment