నవోదయ ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్
న్యూఢిల్లీ : నిరుద్యోగులకు తీపికబురు. నవోదయలో విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ వెలువడింది. కాంట్రాక్టు ప్రాతిపదికన 454 మంది ఉపాధ్యాయుల భర్తీకి నవోదయ విద్యాలయ సమితి(ఎన్‌వీఎస్) ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.
గోవా, గుజరాత్, మహారాష్ర్ట, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీలో ఖాళీల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ భర్తీ జరగనుంది. మొత్తం 454 ఖాళీల్లో 73 ఫ్యాకల్టీ కమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు కాగా, 98 పీజీటీ, 283 టీజీటీ పోస్టులు ఉన్నాయి. పీజీటీ పోస్టులకు నెలవారీ జీతం సాధారణ స్టేషన్ అయితే రూ
టీజీటీ పోస్టులకు నెలవారీ జీతం సాధారణ స్టేషన్‌లోనైతే రూ. 26,250 కాగా, హార్డ్ స్టేషన్(కుచ్, డాంగ్స్, రత్నగిరి)లోనైతే రూ. 31,250 గా ఉంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 11 వ తేదీ లోగా దరఖాస్తులనందించాలి.
దరఖాస్తులను [email protected] కు మెయిల్ చేయాలి. నియామకమైన ఉపాధ్యాయులకు బోర్డింగ్, లాడ్జింగ్ క్యాంపస్ ఆవరణలోనే కల్పిస్తారు
0 Response to "నవోదయ ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్"
Post a Comment