బడికి వెళ్లొచ్చు!
9-12 క్లాసుల విద్యార్థులకు అనుమతి
సందేహ నివృత్తికి టీచర్లను కలవొచ్చు
అయితే కుటుంబ అంగీకారం కావాలి
ఈనెల 30దాకా విద్యాలయాలు మూతే
అన్‌లాక్ 4.0పై రాష్ట్ర సర్కారు ఉత్తర్వు
21 నుంచి తాజా ఆదేశాలు అమల్లోకి
అమరావతి, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): తొమ్మిది, పది తరగతుల విద్యార్థులు పాఠశాలలకు వెళ్లవచ్చు. ఇంటర్మీడియెట్ విద్యార్థులూ కళాశాలలకు వెళ్లవచ్చు. ఆన్‌లైన్ తరగతుల విషయంలోగానీ, బోధనకు సంబంధించిన సందేహాలనుగానీ ఉపాధ్యాయులను విద్యాలయాల్లో కలిసి నివృత్తి చేసుకునేందుకు ఈ విద్యార్థులను ప్రభుత్వం అనుమతించనుంది.
అయితే, ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రుల రాత పూర్వక అనుమతిని తప్పనిసరి చేసింది
రాష్ట్రంలో స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు సెప్టెంబరు 30 వరకూ మూసే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు 9-12తరగతులు మినహాయింపు. తక్కిన క్లాసులకు పాఠశాలల్లో రెగ్యులర్ తరగతుల నిర్వహణ, సిలబస్ బోధన ఉండవు. ఆన్‌లైన్ తరగతుల పనుల నిమిత్తం పాఠశాలలకు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది 50 శాతం వరకు హాజరు కావాల్సి ఉంటుంది. గ
త కొంతకాలంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే బోధన జరుగుతోంది. దూరదర్శన్- సప్తగిరి చానల్ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. ఉపాధ్యాయులు మాత్రం పాఠశాలలకు వెళుతున్నారు. ప్రతిరోజూ కొందరు టీచర్లు స్కూళ్లకు వెళ్లేలా ప్రధానోపాధ్యాయులు ప్రణాళిక చేసుకున్నారు. 2020-21 విద్యా సంవత్సరానికి కొత్త అడ్మిషన్లు, ఆన్‌లైన్ బోధనపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు.
అన్‌లాక్-4 మార్గదర్శకాల ప్రకారం .. ఈ నెల 21 నుంచి పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు కూడా కళాశాలలకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే ఈ తేదీ నుంచే స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్లను తెరుచుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది
0 Response to "బడికి వెళ్లొచ్చు!"
Post a Comment