మనోవికాస కేంద్రాలుగా అంగన్‌వాడీలు
మంచి విద్య, పౌష్టికాహారం అందిస్తాం
ఆంగ్ల మాధ్యమంతో గట్టి పునాది వేసేలా మార్పులు
వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ పథకాలను ప్రారంభించిన సీఎం జగన్
53% మంది గర్భిణుల్లో రక్తహీనత...
‘రాష్ట్రంలోని
గర్భిణుల్లో 53% మందిలో రక్తహీనత ఉంది. 31.9% పిల్లలు తక్కువ బరువుతో
జన్మిస్తున్నారు. 17.2% మంది చిన్నారులు బరువుకు తగ్గ ఎత్తు లేరు. వయసుకు
తగ్గ ఎత్తు లేని వారు 32% మంది ఉన్నారు. పేదల ఇళ్లలోని పిల్లలు, వారి
తల్లిదండ్రులకు పోషకాహారం లేకపోతే బలహీనత, రక్తహీనతతో పాటు ఇతర అనారోగ్య
సమస్యలు వస్తున్నాయి. రోజూ పెట్టే ఆహారం గర్భిణులు, బాలింతలు, చిన్నారులు
తినడానికి ఆసక్తిగా ఉండాలి. అవసరమైతే మెనూలో మార్పులు తీసుకురావాలి. ఎక్కువ
ఖర్చయినా ఫర్వాలేదు’ అని సీఎం పేర్కొన్నారు.
పేద పిల్లలు గొప్పగా చదవాలనే ఆంగ్ల మాధ్యమం
‘పేద
పిల్లలు గొప్పగా చదివి రాణించాలన్న తాపత్రయంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో
పూర్వ ప్రాథమిక విద్య (పీపీ-1, పీపీ-2) అమలు చేస్తున్నాం. ఆంగ్ల మాధ్యమంతో
గట్టి పునాది వేసేలా మార్పులు చేస్తున్నాం. ఆటపాటలు, మాటల ద్వారా విద్యా
బోధన అందిస్తాం. ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో రూపం
మార్చుకున్న అంటరానితనం కనిపిస్తోంది. వారి మనసు మారాలని దేవుడిని
ప్రార్థిస్తున్నాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ వీడియో
కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాలకు చెందిన పలువురు లబ్ధిదారులతో
మాట్లాడారు. ‘అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం తీసుకోవడం వల్ల
రక్తహీనత లేకుండా ఉన్నాం. నెలకు సరిపడా పోషకాహారాన్ని ఇంటికే పంపుతున్నారు.
ప్రతి నెలా ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. నవరత్నాల పథకాలు మాకు
ఉపయోగపడుతున్నాయి’ అని పలువురు లబ్ధిదారులు తెలిపారు
0 Response to " మనోవికాస కేంద్రాలుగా అంగన్‌వాడీలు"
Post a Comment