అమెరికా విద్యపై అంతర్జాల సదస్సు



తేదీలు: ఈనెల 2,3,9,10...విదేశీ విద్య సమన్వయకర్త కుమార్‌


అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో చదువుకోవాలనే ఆకాంక్ష ఉన్న విద్యార్థుల కోసం...ఒకేసారి వంద అత్యుత్తమ విశ్వవిద్యాలయాలతో మాట్లాడే అవకాశం కల్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విదేశీ విద్య సమన్వయకర్త కుమార్‌ అన్నవరపు తెలిపారు. 



కరోనా నేపథ్యంలో విద్యార్థుల కోసం అమెరికాలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలను అంతర్జాల సదస్సు ద్వారా ఒకే వేదికపైకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.


అమెరికాలో మాస్టర్స్‌, పీహెచ్‌డీ చేయాలనుకునేవారికి అక్టోబరు 2, 3 తేదీల్లో, అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరాలనుకునేవారికి అక్టోబరు 9, 10 తేదీల్లో సాయంత్రం 5.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు అంతర్జాల సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బీఐటీ.ఎల్‌వై/ఈడీయూఎ్‌సఏఎ్‌ఫఏఐఆర్‌20-బీమెయిల్‌ ద్వారా ఇందులో రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలని సూచించారు.



 ఏవైనా అనుమానాలుంటే ఎడ్యుకేషన్‌ కోఆర్డినేటర్‌ 20-జీమెయిల్‌.కామ్‌కు మెయిల్‌ చేసి అడగొచ్చని పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అమెరికా విద్యపై అంతర్జాల సదస్సు"

Post a Comment