ఫేస్‌బుక్‌ మెసెంజర్‌.. ఇక మీదట ఐదుగురికే

ఇంటర్నెట్ డెస్క్‌: సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్ నకిలీ వార్తల కట్టడికి మెసెంజర్‌లో కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా మెసెంజర్‌ నుంచి ఇతరులకు ఫార్వార్డ్ చేసే మెసేజ్‌లపై పరిమితి విధించింది. ఇక మీదట ఎవరైనా ఏదైనా మెసేజ్‌ను ఒకేసారి కేవలం ఐదుగురికి మాత్రమే ఫార్వర్డ్‌ చేయగలరు. ఒక వేళ పరిమితికి మించి మీరు మెసేజ్‌ పంపాలని ప్రయత్నిస్తే ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా ఫార్వర్డింగ్ లిమిట్ రీచ్‌డ్‌ అనే సందేశం కనిపిస్తుంది. సమాజానికి హాని కలిగించే నకిలీ, ప్రమాదకర వార్తల వ్యాప్తిని అడ్డుకునేందుకు మెసేజ్‌ ఫార్వాడింగ్‌పై పరిమితి విధించడం ఎంతో ముఖ్యమైన చర్యని ఫేస్‌బుక్ తెలిపింది.


మార్చి నెలలోనే ఈ ఫీచర్‌ను ఫేస్‌బుక్‌ అంతర్గతంగా పరిశీలించింది. ప్రస్తుతానికి కొన్ని దేశాలకు మాత్రమే దీనిని పరిమితం చేసింది. సెప్టెంబరు 24 నుంచి ప్రపంచవ్యాప్తంగా యూజర్స్‌ అందరికీ ఇది అమల్లోకి వస్తుంది. దీని ద్వారా కొవిడ్‌-19 మహమ్మారిపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి అడ్డుకట్టవేయవచ్చని ఫేస్‌బుక్‌ చెబుతోంది. అయితే న్యూజిలాండ్, అమెరికాలో త్వరలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు టెక్‌ వర్గాల సమాచారం. గతంలో కూడా నకిలీ వార్తల వ్యాప్తిని అడ్డుకునేందుకు ఫేస్‌బుక్‌ ఇదే తరహా ఫీచర్‌ను భారత్‌లో వాట్సాప్‌కు తీసుకొచ్చింది. తర్వాత దానిని మిగతా దేశాలకు విస్తరింపజేసింది


SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "ఫేస్‌బుక్‌ మెసెంజర్‌.. ఇక మీదట ఐదుగురికే"

Post a Comment