ఏపికి వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు.
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి ముందు చూస్తే గొయ్యి.. వెనక చూస్తే నుయ్యి లా మారింది. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి.. ఒక వైపు కరోనా కోరలు చాచుతుంటే మరో వైపు కారు మబ్బులు కమ్ముకున్నాయి. రోజూ రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కు కళ్లెం వేయడానికి ప్రభుత్వం అహర్నిశలు ప్రయత్నిస్తూ ముందుకు సాగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా టెస్టులను నిర్వహించిన కూడా ప్రభుత్వం కళ్లు కప్పి ముంచుకొస్తుంది. పరిస్థితి చెయ్యి దాటి పోవడంతో కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ ను ప్రకటించారు.
గతంలో లాగా కాకుండా ఇప్పుడు కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు కూడా పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్ప పీడనంగా మారింది

దీనివలన రాగల రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం సూచించింది.
ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. సముద్ర పరిస్థితి గందరగోళంగా మారుతుందట.. 3 నుంచి 4 మీటర్ల వరకు అలలు ఎగసి పడుతాయట..తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయనీ, మత్స్యకారులెవ్వరూ సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.దీని వల్ల రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.రాయలసీమ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా,కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.కొన్ని చోట్ల కుండపోతగా వర్షాలు కురవడంతో నదులు, వాగులు,వంకలు నిండుకుండలా పొంగి పోర్లుతాయని అంటున్నారు.ప్రజలు వర్ష తీవ్రతను బట్టి బయటకు రావాలని సూచిస్తున్నారు

0 Response to "ఏపికి వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు."
Post a Comment