ఈ కొత్త Whatsapp ఫీచర్‌తో ఇక మీ phone storage గురించి దిగులే అవసరం లేదు!
Whatsappలో ఎప్పటికప్పుడు మన స్నేహితులు, వివిధ రకాల గ్రూపుల నుండి భారీ మొత్తంలో ఫోటోలు వీడియోలు వస్తూ మన phone storage మొత్తాన్ని ఆక్రమిస్తూ ఉంటాయి. దీనివల్ల మెల్లగా ఫోన్ కూడా స్లో అవుతుంది.
Phoneలో అనవసరమైన ఫైళ్లను ఎప్పటికప్పుడు గుర్తించి తొలగించడం చాలా పెద్ద శ్రమతో కూడుకున్న వ్యవహారం. ఈ నేపథ్యంలో Whatsapp సంస్థ ఒక అద్భుతమైన సదుపాయాన్ని తీసుకొస్తోంది. దీని ద్వారా ఇక మీదట వాట్స్అప్ శుభ్రపరచడం, ఎప్పటికప్పుడు మీ ఫోన్ స్టోరేజ్ ఖాళీ చేయడం చాలా సులభం. Storage usage అనే సదుపాయాన్ని Whatsapp తీసుకు వస్తోంది. దీనికి సంబంధించిన స్క్రీన్షాట్ మీరు పైన చూడొచ్చు
దీంట్లో అన్నిటికంటే పైన మీ ఫోన్లో మొత్తం ఎంత స్టోరేజ్ ఖాళీగా ఉంది, మొత్తం ఎంత స్టోరేజ్ ఉంది అన్న సమాచారం ఒక ప్రత్యేకమైన బార్ రూపంలో చూపించబడుతుంది. వాట్స్అప్ ఎంత స్థలాన్ని ఆక్రమించింది అన్నది కూడా దీని ద్వారా మనకు అర్థం అవుతుంది. ఆ క్రిందనే forwarded files, large files అనే రెండు రకాల విభాగాలు ఉంటాయి. ఇతరుల నుండి ఫార్వర్డ్ చేయబడిన ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా forwarded విభాగంలో కనిపిస్తాయి. ఆ విభాగాన్ని ఎంపిక చేసుకోవటం ద్వారా దాన్ని చాలా సులభంగా శుభ్రపరచవచ్చు. అదేవిధంగా మీ phoneలో ఎక్కువ పరిమాణం కలిగి, ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకున్న Whatsapp files ఏవైతే ఉన్నాయో వాటిని సులభంగా గుర్తించి డిలీట్ చేసుకోటానికి Large files అనే విభాగం ఉపయోగపడుతుంది.
పైన చెప్పబడిన రెండు పద్ధతులు అనుసరించడం ద్వారా Whatsapp ద్వారా ఎప్పటికప్పుడు నిండిపోయే మీ ఫోన్ స్టోరేజ్ మొత్తాన్ని చాలా సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. Large Files అనే విభాగంలో కేవలం వాట్సాప్ మీడియా మాత్రమే కాకుండా మీ ఫోన్లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించిన ఇతర ఫైళ్ల సమాచారాన్ని కూడా చూడొచ్చు. Chats అనే విభాగంలో మీరు వాట్సాప్ లో ఛాట్ చేసే వ్యక్తుల్లో ఎవరి ఛాట్ కన్వర్‌జేషన్ అయితే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించిందో దాని వివరాలు చూడొచ్చు. కావాలంటే ఆ ఛాట్ మొత్తాన్నీ డిలీట్ చేయొచ్చు. త్వరలో అందరు Whatsapp వినియోగదారులకి ఈ సదుపాయం రాబోతోంది
0 Response to "ఈ కొత్త Whatsapp ఫీచర్‌తో ఇక మీ phone storage గురించి దిగులే అవసరం లేదు!"
Post a Comment