పాఠశాలల పున:ప్రారంభంపై పునరాలోంచాలి: రామకృష్ణ
అమరావతి: ఏపీలో రోజు రోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న
నేపథ్యంలో పాఠశాలల పున:ప్రారంభంపై పునరాలోచించాలని సీపీఐ రాష్ట్ర
కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ రాశారు.
ఏపీలో 3,61,712 కరోనా పాజిటివ్ కేసులు, 3368 మరణాలు
సంభవించాయని...
ప్రతిరోజు ఏపీలో 8 వేల నుండి 10 వేలకు పైబడి కరోనా పాజిటివ్
కేసులు నమోదవుతూనే ఉన్నాయని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సెప్టెంబర్ 5
నుండి పాఠశాలలు ప్రారంభించటం సరికాదని సూచించారు. రాష్ట్రంలో పలువురు
ఉపాధ్యాయులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారన్నారు. అనంతపురం జిల్లాలో టీచర్
చారుమతి, కృష్ణా జిల్లాలో ఇంటూరి ప్రతాప్ అనే టీచర్ మృతి చెందటం విచారకరమని
ఆయన అన్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ
అయ్యిందని చెప్పారు. అమెరికాలో పాఠశాలలు తెరిచిన 15 రోజుల్లో లక్ష మంది
పిల్లలకు కరోనా సోకడం గమనార్హమని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం
మద్యం షాపులకు అనుమతిచ్చి కరోనా వ్యాప్తికి కారణమైందని విమర్శించారు. కరోనా
పూర్తిగా నివారించబడే వరకైనా లేదా వ్యాక్సిన్ వచ్చే వరకైనా పాఠశాలల
పున:ప్రారంభం వాయిదా వేయడం మంచిదని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.
0 Response to "పాఠశాలల పున:ప్రారంభంపై పునరాలోంచాలి: రామకృష్ణ"
Post a Comment