పాఠశాలల విద్యార్థులకు మాస్కులు: ఎస్‌ఎ్‌సఏ

నర్సీపట్నం, ఆగస్టు 24: విద్యా సంస్థలను వచ్చే నెల ఐదో తేదీన పునఃప్రారంభించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కరోనా నేపథ్యంలో ప్రతి విద్యార్థికి మాస్కులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర శిక్ష అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.వెట్రిసెల్వీ ఆదేశాలు జారీ చేశారు. 



ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల వయసునుబట్టి మూడు సైజుల్లో మాస్కులు తయారు చేస్తున్నారు. ఈ నెలాఖరునాటికి మాస్కులు సిద్ధం చేసి ఎంఈఓలకు అందజేయాలని, వారి నుంచి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్వీకరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు 42,34,322 మంది 





విద్యార్థులు(2019-20 విద్యా సంవత్సరంలో చదివిన విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకుని) ఉన్నారు. ఒక్కొక్కరికి మూడేసి చొప్పున మొత్తం 1,27,02,926 మాస్కులు సిద్ధం చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) సీఈఓను ఆదేశించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పాఠశాలల విద్యార్థులకు మాస్కులు: ఎస్‌ఎ్‌సఏ"

Post a Comment