ఆ ఇంటర్ విద్యార్థులకు పాస్ మార్కులే
- అందరికీ కంపార్ట్‌మెంటల్ ఉత్తీర్ణత
- ఫెయిలైన విద్యార్థులపై ఇంటర్ బోర్డు నిర్ణయం
- ఫస్టియర్ ఇంప్రూవ్‌మెంట్‌కు 2021 మార్చిలో చాన్స్
- ఫయిలైన వారంతా కంపార్ట్‌మెంటల్‌లో పాస్
అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరినీ కంపార్ట్‌మెంటల్‌లో ఉత్తీర్ణులైనట్లు మార్కుల జాబితాలో పేర్కొంటామని ఇంటర్‌బోర్డు సెక్రెటరీ వి.రామకృష్ణ తెలిపారు. వారు ఫెయిలైన ప్రతి సబ్జెక్టులోనూ పాస్ మార్కులు వేస్తామన్నారు. కరోనా ఉధృతితో దాదాపు 6లక్షల మంది విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మార్చిలో జరిగిన ఫస్టియర్ పరీక్షల్లో ఉత్తీర్ణులై, మార్కుల ఇంప్రూవ్‌మెంట్ కోరుకునేవారు 2021 మార్చి-ఏప్రిల్‌లో సెకండియర్ విద్యార్థులతో పాటు మళ్లీ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు
0 Response to "ఆ ఇంటర్ విద్యార్థులకు పాస్ మార్కులే"
Post a Comment